సెమీ క్రిస్మస్ వేడుకలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: యేసుక్రీస్తు జన్మదినం ను పురస్కరించుకుని ముందస్తుగా నిర్వహించే సెమీ క్రిస్టమస్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం చాలా సంతోషకరమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని నేషనల్ క్రిస్టియన్కౌన్సిల్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన చిల్డ్రన్ సెమీ క్రిస్మస్ వేడుకలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కరుణామయుడు ఎంతో పవిత్రంగా భావించే క్రిస్మస్ పండుగను ఆనందోత్సవాలతో, భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ ముందస్తు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. దేవుడు కృప ప్రతి ఒక్కరి పైన ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల వారిని ఆదరిస్తూ అందరి అభిమానాలను చూరగొంటున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ లు, క్రిస్టియన్ సోదరీమణులు, సోదరులు తదితరులు పాల్గొన్నారు.

సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here