నమస్తే శేరిలింగంపల్లి: నల్లగండ్ల అపర్ణా గ్రాండే గృహ సముదాయంలో ఉన్న క్లబ్ హౌస్ లో ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిహెచ్ఇఎల్ రిటైర్డ్ డాక్టర్ డా. రాకేశ్ ధీర్ హాజరై మధుమేహ వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మధుమేహం తో బాధపడే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాని వలన సంభవించే అనేక వ్యాధులు, వాటి లక్షణాలు, వ్యాధి గ్రస్తులు తినాల్సిన ఆహారాలు, పండ్లు, చేయ వలసిన వ్యాయామాలు ఇంకా అనేక విషయాల గురించి డాక్టర్ రాకేశ్ ధీర్ విపులంగా వివరించారు. అంతకుముందు అక్కడకు వచ్చిన వారికి మధుమేహ పరీక్షలు నిర్వహించారు. పలువురి సందేహాలు, ప్రశ్నలకు డాక్టర్ వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డా.హరీష్ జైన్, వసంత రావు, నాగరాజారావు, బివిరావు, పి.ఎన్.రెడ్డి, విగ్, గోపాల్ శర్మ, లాల్, వినోద్ గౌడ్, శ్రీనివాస్, బ్రహ్మా నందం, కుసుమ జైన్, హర్ ప్రీత్ నారంగ్, స్నేహా, సునీతా శర్మ తదితరులు పాల్గొన్నారు.