నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ శిల్పా ఎన్‌క్లేవ్‌లోని విశాఖ శ్రీ శారద పీఠపాలిత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయ ప్రాంగణంలో ఐదవరోజు లక్ష దీపోత్సవం ఘనంగ కొనసాగింది. సాయంత్రం శివపార్వతుల కళ్యాణం అంశంపై బ్రహ్మశ్రీ నోరి నారాయణ మూర్తి ప్రవచనం భక్తులను ఆధ్యంతం ఆకట్టుకుంంది.
ప్రధానార్చకులు పవనకుమార శర్మ, మురళీధర శర్మ బృందంల పర్యవేక్షణలో కొనాసాగిన ఈ ఉత్సవాలలో ఆలయ వ్యవస్థాపక చైర్మన్ యూవీ రమణమూర్తి, కమిటి సభ్యులు చంద్రశేఖర్, చెన్నారెడ్డి, శిల్పాఎన్‌క్లేవ్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీ వాసులు, ఆలయ సేవాదళం సభ్యులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పదివేల దీపాలు వెలిగించారు.