నమస్తే శేరిలింగంపల్లి:ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కలిసికట్టుగా ఉద్యమం చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గ ఉద్యమకారులను పలువురు ఉద్యమకారులు ఏకం చేస్తున్నారు. అందులో భాగంగా హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని యూత్ కాలనీలో గల హర్షిత్ బాయ్ షేక్ జమీర్ ను బుధవారం కలిశారు. ఉద్యమకారులను పార్టీ పరంగా, రాజకీయపరంగా గుర్తించి తగిన న్యాయం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరం భాగస్వాములం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో గంగారం సంగారెడ్డి, దుర్గాప్రసాద్, వెంకటేష్, ఈశ్వర్, స్వామి, మిద్దెల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.