నమస్తే శేరిలింగంపల్లి: సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా దసరా ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ నక్లెస్ రోడ్డు జలవిహార్ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా అలయ్ బలయ్ నిర్వహించడం జరిగిందని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా అలయ్ బలయ్ తో ఆప్యాయత, అనురాగాలు వెలువడుతాయని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.