ఒలంపియా జోన్ లో ఘనంగా షావోలిన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ వినాయక్ నగర్ లోని ఒలంపియా జోన్ లో షావోలిన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. అకాడమీలో శిక్షణ పొందిన విద్యార్థులకు కుంగ్ ఫూ కలర్ బెల్ట్ పరీక్షలు నిర్వహించారు. అకాడమీ డైరెక్టర్, ఫౌండర్, చీఫ్ ఎగ్జామినర్, గ్రాండ్ మాస్టర్ పి.శ్రీనివాస్ విద్యార్థుల శక్తి సామర్థ్యాలను పరీక్షించారు. విద్యార్థుల శక్తిని బట్టి బెల్టులను ప్రధానం చేసి, ప్రశంసా పత్రాలు అందజేశారు.

విద్యార్థులకు బెల్టు ప్రధానం చేస్తున్న గ్రాండ్ మాస్టర్ పి.శ్రీనివాస్

ఈ సందర్భంగా గ్రాండ్ మాస్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ వల్ల శారీరక, మానసిక దారుఢ్యంతో పాటు ముఖ్యంగా మహిళలు, యువతులు, బాలికల రక్షణకు ఎంతగానో దోహద పడుతుందని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మాస్టర్ లు షేక్ అజీజ్, విజయ్, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

బెల్టులు, ప్రశంసా పత్రాలు పొందిన విద్యార్థులతో గ్రాండ్ మాస్టర్ శ్రీనివాస్, ఇతర మాస్టర్లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here