శేరిలింగంపల్లి, నవంబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని బొల్లారం ప్రధాన రహదారి నుండి బికే ఎన్క్లేవ్, రెడ్డి కాలనీ, ప్రజా షెల్టర్ నుండి మక్తా మహబూబ్ పేట్ విలేజ్ వరకు రూ.85 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.