నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం లోని సాయిరత్న కాలనీ లో శ్రీశ్రీశ్రీ బావిగడ్డ మైసమ్మ తల్లి దేవాలయం లో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం శుక్రవారం జరిగింది. గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ దైవ చింతనతో ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. శ్రీశ్రీశ్రీ బావిగడ్డ మైసమ్మ తల్లి దేవాలయం విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొనడం సంతోషకరం అన్నారు. గచ్చిబౌలి డివిజన్ ఆలయాల అభివృద్ధిలో ఎల్లప్పుడూ ముందుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షుడు నరేందర్ ముదిరాజ్, రంగారెడ్డి జిల్లా ఎక్జిక్యూటివ్ మెంబర్ నీరుడి సురేష్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్, దయాకర్, అంబటి అశోక్ ముదిరాజ్, సంజీవ, గోపనపల్లి వడ్డెర సంఘం అధ్యక్షుడు అలకుంట శ్రీరామ్, సీనియర్ నాయకులు ఈగ సుధాకర్ ముదిరాజ్, రాజు, శ్యామ్ యాదవ్, రాము యాదవ్, కార్యకర్తలు పాల్గొన్నారు.






