నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని సందయ్యనగర్ కాలనీలో అంతర్గత సి సి రోడ్ల వెడల్పు కోసం కాలనీ వాసులు సహకరించాలని స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్థానికులను కోరారు. సందయ్య నగర్ లో శుక్రవారం కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పర్యటించారు. ప్రజల సౌకర్యార్థం అంతర్గత రోడ్ల వెడల్పు పనులు చేపట్టనున్నామని, అందుకు అందరూ సహకరించాలని కోరగా తప్పకుండా సహకరిస్తామని కాలనీ వాసులు ముక్త కంఠంతో చెప్పారు. రోడ్ల నిర్మాణం పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూడాలని సంబంధిత అధికారులకు రాగం నాగేందర్ యాదవ్ సూచించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ డివిజన్ గౌరవ అధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్, సందయ్య నగర్ కాలనీ అధ్యక్షుడు బస్వరాజ్, వార్డ్ మెంబర్ శ్రీకళ, కాలనీ వాసులు సబీనా, గోపాల్ యాదవ్, ఏఈ సునీల్ కాలనీ వాసులు తదితరులు ఉన్నారు.
