శానిటేషన్ సిబ్బందికి పీపీఈ‌ కిట్లు అందజేసిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: కరోనా నియంత్రణ చర్యల్లో విశ్రాంతి లేకుండా పని చేస్తున్న శానిటేషన్ సిబ్బంది సేవలు అభినందనీయమని స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. శుక్రవారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గంలోని వార్డు కార్యాలయం ఆవరణలో శానిటేషన్ సిబ్బందికి పీపీఈ కిట్లను కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో పారిశుద్ధ్య కార్మికులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని ఇంత కష్టకాలంలో వాళ్ళ ప్రాణాలను పనంగా పెట్టి రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు నరేందర్ ముదిరాజ్, రంగారెడ్డి జిల్లా ఎక్జిక్యూటివ్ మెంబర్ నీరుడి సురేష్, గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షుడు వెంకటేష్ , దయాకర్, అంబటి అశోక్ ముదిరాజ్, సంజీవ, గోపనపల్లి వడెర సంఘం అధ్యక్షుడు అలకుంట శ్రీరామ్, సీనియర్ నాయకులు ఈగ సుధాకర్ ముదిరాజ్, రాజు, శ్యామ్ యాదవ్, రాము యాదవ్, జీహెచ్ఎంసీ అధికారులు, ఎస్ ఆర్ పీ కృష్ణ , శానిటేషన్ సూపర్ వైజర్ శ్రీనివాస్, శానిటేషన్ సిబ్బంది భారీ పాల్గొన్నారు.

శానిటేషన్ సిబ్బందికి‌ పీపీఈ కిట్లను పంపిణీ చేస్తున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here