నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలో అవసరం ఉన్న చోట నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయించడం జరుగుతుందని టిఆర్ఎస్ పార్టీ హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ అన్నారు. విద్యుత్ శాఖ వారు నూతన విద్యుత్ స్తంబాల ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. ఇంతకు ముందు ఉన్న ఇనుప స్తంబాలను తొలగింపజేసి నూతనంగా సిమెంట్ విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, శ్రీధర్ గౌడ్, మల్లేష్ , కలిల్, కరీం తదితరులు పాల్గొన్నారు.