నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని గౌతమీనగర్ కాలనీలో మంగళవారం స్థానిక కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పర్యటించారు. కాలనీలో రోడ్ల పై మురుగు నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కాలనీలో నూతనంగా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ పైప్ లైన్ నిర్మాణంతో గౌతమీ నగర్, వేముకుంట కాలనీలో డ్రైనేజీ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. కాలనీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులతో చర్చించి త్వరలోనే సమస్యలు పరిష్కరించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, ఏఈ రమేష్, వర్క్ ఇన్స్పెక్టర్ జగన్, కాలనీ అసోషియషన్ సభ్యులు, టిఆర్ఎస్ నాయకులు హరిష్, జమల్ ఖాన్, శ్రీనివాస్, గాంధీ, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.