నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్లో వాడవాడలో స్వాంతత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. గోపన్‌పల్లి గ్రామం, గోపన్‌పల్లి తాండ, మంజీర డైమండ్స్, నల్లగండ్ల, గోపన్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలు, ఎన్టీఆర్ నగర్, గౌలిదొడ్డిలలో జరిగిన వేడుకల్లో స్థానిక కార్పొరేట్ వి.గంగాధర్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న త్రివర్ణ పతాకాలను ఆవిష్కరంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ కార్పొరేటర్‌గా మువ్వన్నెల జెండాలను ఆవిష్కరించే అవకాశం లభించడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని అన్నారు. 75 వసంతాల భారత స్వాంతత్ర వేడుకలు వాడవాడల ఉత్సాహంగా నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు. స్వతంత్ర సమరయోదుల త్యాగాలను చిన్నారులకు వివరించి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన భాద్యత ప్రతి తల్లితండ్రి పైనా ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమాలను ఉత్సవాల నిర్వ హకులు, స్థానిక, డివిజన్, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు.