నమస్తే శేరిలింగంపల్లి: స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మియాపూర్ డివిజన్ మక్త మహబూబ్ పేట్ లో బిజెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో ముఖ్యఅతిథిగా రవికుమార్ యాదవ్ హాజరై జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో సమస్యలను అధిగమించి భారతదేశం ప్రగతి దిశగా ముందుకెళ్తున్న తరుణంలో ప్రతి భారతీయుడు గర్వించ దగ్గ రోజు అని అన్నారు. ప్రతి ఒక్క భారతీయునికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంటెస్ట్ కార్పొరేటర్ రాఘవేంద్ర రావు, గుండె గణేష్ ముదిరాజ్, జాజిరావు శ్రీను, యస్. రవీందర్, ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, మల్లేష్, బాబు ముదిరాజ్, జాజిరావు రాము, చంద్ర మాసిరెడ్డి, వినోద్ యాదవ్, శ్రీధర్, గోపి, శివ, నరేష్, అనూప్, రాజేందర్, మహిళా అధ్యక్షురాలు పద్మ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.