శిల్పారామంలో స్వాతంత్ర్య సమరయోదుల ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభం

నమస్తే శేరిలింగంపల్లి: భార‌త స్వాతంత్య్రోద్య‌మంలో పోరాడిన ప్ర‌ముఖ తెలుగు స్వాతంత్య్ర స‌మ‌ర యోధులపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందిన రీజనల్ ఔట్‌రీచ్‌ బ్యూరో (ఆర్.ఒ.బి.) ఆధ్వ‌ర్యంలో మాదాపూర్ శిల్పారామంలో శుక్రవారం శుక్రవారం ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో, రీజ‌న‌ల్ ఔట్‌రీచ్ బ్యూరో సౌత్‌జోన్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఎస్‌.వెంక‌టేశ్వ‌ర్ ఫోటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భార‌త‌దేశాన్ని విముక్తి చేయ‌డానికి స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులు చేసిన త్యాగాలు, పూర్వ హైద‌రాబాద్ సంస్థానంలో నిజాం పాల‌న‌కు వ్య‌తిరేకంగా పోరాడి హైద‌రాబాద్ రాష్ట్రాన్ని ఇండియ‌న్ యూనియ‌న్‌లో విలీనం చేయ‌డానికి కృషి చేసిన వారిని గుర్తు చేసుకుంటూ ప్ర‌స్తుత త‌రానికి తెలియ‌జేయ‌డ‌మే లక్ష్యంగా ‌ఈ ఫోటో ఎగ్జిబిష‌న్ ను ఏర్పాటు చేశారన్నారు. దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్స‌వ్ లో భాగంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిష‌న్ ను స్వాత్రంత్య్ర పోరాట యోధుల త్యాగాల‌ను స్మ‌రించుకోవ‌డానికి ఈ ఎగ్జిబిష‌న్‌ను ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. ప్ర‌జ‌లు కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ ఈ ఎగ్జిబిష‌న్‌ను ఈ నెల 17 వ తేదీ వరకు సంద‌ర్శించవచ్చని అన్నారు. కేంద్ర స‌మాచార, ప్ర‌సార మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ప్ర‌చుర‌ణ‌ల విభాగం స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన పుస్త‌క‌ ప్ర‌ద‌ర్శ‌నను ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్‌వోబీ డైరెక్ట‌ర్ శృతిపాటిల్‌, డిప్యూటీ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ మాన‌స్ కృష్ణ‌కాంత్‌, ప్ర‌చుర‌ణ‌ల విభాగం అసిస్టెంట్ డైరెక్ట‌ర్ శ్రీ‌మ‌తి కృష్ణ వంద‌న త‌దిత‌రులు పాల్గొన్నారు.

శిల్పారామంలో ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభిస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here