నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టెలికాంనగర్ హోవర్డ్ లేక్ వ్యూ పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన మొబైల్ వాక్సినేషన్ సెంటర్ ను శుక్రవారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి పరిశీలించారు. ప్రతి ఒక్కరూ వాక్సిన్ తప్పని సరిగా వేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం రాని వారికి ఈ మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా (అర్బన్) సహాయ కార్యదర్శి రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు, నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, దినేష్ యాదవ్, మురళి, సుబ్రహ్మణ్యం, మన్నే రమేష్ , శానిటేషన్ సూపర్ వైజర్ రషీద్ ,తదితరులు పాల్గొన్నారు.