నమస్తే శేరిలింగంపల్లి: భవిష్యత్తులో విద్యార్థులు మంచి ఉన్నత స్థానంలో ఉండాలంటే విద్య ద్వారానే సాధ్యమని మిరియాల రాఘవ ట్రస్ట్ డైరెక్టర్, టీఆర్ఎస్ యువజన నాయకులు మిరియాల ప్రీతమ్ అన్నారు. పీఎస్ఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యనభ్యసించి పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలో మంచి ప్రతిభను కనబరిచి మెరుగైన ర్యాంకులు సాధించిన విద్యార్థులకు శుక్రవారం బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మిరియాల ప్రీతమ్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మియాపూర్ లోని పోతుకూచి ట్రస్ట్ వారి సేవలు అభినందనీయం అన్నారు. పీఎస్ఎస్ ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్ పేద, అనాథ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత స్థానాల్లో స్థిరపరిచారని అన్నారు. 2021-2022 సంవత్సరానికి గాను నిర్వహించిన పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలో పీఎస్ఎస్ ట్రస్ట్ కు చెందిన ముగ్గురు విద్యార్థులు సిరిగద్దె మమత, కీర్తన జయశ్రీ, ఉంగరాల ఉమా మహేశ్వరి మెరుగైన ర్యాంకులు సాధించడం సంతోషకరమని అన్నారు. పీఎస్ఎస్ ట్రస్ట్ చైర్మన్ పి శ్రీనివాస్, ట్రస్ట్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.