నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన శుక్రవారం చేపట్టిన బడుగుల ఆత్మ గౌరవ పోరు కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ బిజెపి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాదాపూర్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ గంగుల రాధాకృష్ణ యాదవ్, శేరిలింగంపల్లి కంటెస్టెడ్ కార్పొరేటర్ కంచెర్ల ఎల్లేష్, శేరిలింగంపల్లి బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గంగుల రాధాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం దళితులని మోసం చేసిందని, దళితులకి ఇస్తామన్న మూడెకరాల ఉచిత వ్యవసాయ భూమి ఇస్తామన్న హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 2023 లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు హనుమాన్ నాయక్, రంగారెడ్డి జిల్లా(అర్బన్ ) సెక్రటరీ వరలక్ష్మి, శేరిలింగంపల్లి మహిళా మోర్చా అధ్యక్షురాలు పద్మ, నాయకులు బాలు నాయక్, రామచందర్, వెంకటేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.