నమస్తే శేరిలింగంపల్లి: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు పట్టణ ప్రగతి ఎంతగానో దోహదపడుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. గురువారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్, సుభాష్ చంద్ర బోస్ నగర్ లో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్ తో కలిసి గాంధీ పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టణ సమగ్రాభిద్ధి కోసం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అన్ని సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. పారిశుద్య సమస్య, మురికి గుంతలు, రోడ్లపై ఏర్పడిన గుంతలు, తదితర సమస్యలను అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవడం జరుగుతుందని కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు,ఈఈ శ్రీకాంత్, హెల్త్ ఆఫీసర్ కార్తిక్, డీఈ రూప దేవి, వాటర్ వర్క్స్ డీజీఎం శ్రీమన్నారాయణ, వాటర్ వర్క్స్ ఏరియా మేనేజర్ నివర్తి, ఏఈ ప్రశాంత్, ట్రాన్స్కో ఏఈ కాద్రి, శానిటేషన్ ఎస్ఎస్ శ్రీనివాస్, ఎస్అర్ పీ మహేష్, ఎంటమాలజీ గణేష్, మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ జనరల్ సెక్రెటరీ సాంబశివ రావు, వార్డ్ సభ్యులు రహిం, ఆదిత్య నగర్ టీఆర్ఎస్ బస్తీ అధ్యక్షుడు కాసీం, కృష్ణ కాలనీ టీఆర్ఎస్ బస్తీ అధ్యక్షుడు కృష్ణ యాదవ్, టీఆర్ఎస్ బస్తీ అధ్యక్షుడు ముక్తార్, మైనారిటీ నాయకులు బాబుమియా, లియాఖత్, మనికప్పా, మునాఫ్ ఖాన్, మియాన్ పటేల్, రమేష్ రెడ్డి, మనోహర్, రహ్మాన్, అంకా రావు, బాబుమియా, గౌస్, రామకృష్ణ, యూత్ నాయకులు ఖాజా, షేక్ ఖాజా, విల్సన్, రయిస్, ఇమ్రాన్, మహిళలు బుజ్జమ్మ, ఉమాదేవి, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.