చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన వీకర్ సెక్షన్ బస్తీలో కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ.. స్థానికుల విజ్ఞప్తి మేరకు త్వరలోనే సీసీ రోడ్డును నిర్మిస్తామని హామీ ఇచ్చారు. బస్తీలో ఉన్న చెత్తను డ్రైనేజీలో వేయకూడదని, బస్తీని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కరోనా విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మౌలాలి, రమేష్, మల్లేష్, రాజు, పద్మావతి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.