చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చందానగర్ గాంధీ విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాయకుడు మిద్దెల మల్లారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు కంది జ్ఞానేశ్వర్, దేవేందర్ రావు, రాజారాం, సంగమేశ్వర్, నరసన్న తదితరులు పాల్గొన్నారు.