నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలో ఆదివారం నాల్గవ రోజు పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. రాజేందర్ రెడ్డి నగర్, సురక్ష హిల్స్, సురక్ష ఎనక్లేవ్, విద్యానగర్ కాలనీలలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావు, బల్దియ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. స్థానికంగా నెలకొని ఉన్న సమస్యలను ప్రభుత్వ విప్, స్థానిక కార్పొరేటర్ అడిగి తెలుసుకున్నారు. పచ్చదనం, పరిశుభ్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను స్థానికులకు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీకాంతిని, డీఈ రూపదేవి, ఏఈ అనురాగ్, వర్క్ ఇన్స్పెక్టర్ జగదీష్, జలమండలి మేనేజర్ సునీత, ట్రాన్స్ కో ఏఈ రాజు , స్ట్రీట్ లైట్స్ డీఈ మ్మోహన్, ఎస్ఆర్పీ బాలాజీ, చందానగర్ డివిజన్ తెరాస అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, నాయకులు లక్ష్మీనారాయణ గౌడ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, జనార్దన్ రెడ్డి, దాసరి గోపి, గోవర్ధన్ రెడ్డి, కరుణాకర్ గౌడ్, ధనలక్ష్మి, సుప్రజ ప్రవీణ్, వెంకటేష్, అక్బర్ ఖాన్, దాస్, యూసఫ్, కొండల్ రెడ్డి, యశ్వంత్, భవాని చౌదరీ, బాలాజీ, రఘుపతి రెడ్డి, వెంకటేశ్వరరావు, లింగారెడ్డి, సంజీవ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, ప్రసాద్, శ్రీకాంత్, బాలు, వెంకటరమణ, మల్లారెడ్డి, నిఖిల్ రెడ్డి, శ్రీశైలం, చౌదరీ, హుస్సేన్, నీలకంఠ రెడ్డి, మహేందర్ రెడ్డి, పారునంది శ్రీకాంత్, శ్రీనివాస్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, రాజేందర్, సంజీవ రెడ్డి, శ్రీకాంత్, గోపాల్ రెడ్డి, రాజేష్ దుబే, లాక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.