నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని జెపిఎన్ నగర్ కాలనీలోని షిరిడి సాయిబాబా దేవాలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఆదివారం యోగా శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా వల్ల మానసిక, శారీరక దృడత్వం లభిస్తుందని, ఆలయ ప్రాంగణంలో ఆచరిస్తే ఆధ్యాత్మికత తోడవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి ప్రతినిధులు మహేశ్వర్ రెడ్డి గారు,నరేందర్ గారు, వెంకట్రావ్ గారు,మోహన్ రావు గారు,మనిక్ రెడ్డి గారు మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.