అప‌ర్ణ‌స‌రోవ‌ర్‌, గోప‌న్‌ప‌ల్లిలో డీఆర్ఎఫ్ శానిటైజేష‌న్ స్పెష‌ల్ డ్రైవ్‌…

న‌మ‌స్తేశేరిలింగంప‌ల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలో క‌రోనా నియంత్ర‌ణ‌పై స్థానిక కార్పొరేట‌ర్ గంగాధ‌ర్‌రెడ్డి ప్ర‌త్యేక దృష్టి సారించారు. సంబంధిత అధికారుల‌తో మాట్లాడి శుక్ర‌వారం అపర్ణ సరోవర్‌, గోప‌న్‌ప‌ల్లిలో డీఆర్ఎఫ్ శానిటైజేషన్ స్పెషల్ డ్రైవ్‌ను నిర్వ‌హించారు. అప‌ర్ణ స‌రోవ‌ర్‌లో స్వ‌యంగా డ్రైవ్‌ను వి.గంగాధర్ రెడ్డి ప‌ర్యవేక్షించారు. సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాల‌ని ప్రజలకు అవగాహన సూచించారు. ప్రజలందరూ ఎల్లవేళలా మాస్కు ధరించాలని, భౌతిక దూరం, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను విధిగా పాటించాలని అన్నారు.

అప‌ర్ణ స‌రోవ‌ర్‌లో డీఆర్ఎఫ్ సిబ్బందిచే సోడియం హైపోక్లోరైడ్ ద్రావ‌ణాన్ని పిచికారి చేయిస్తున్న కార్పొరేట‌ర్ గంగాధ‌ర్‌రెడ్డి
గోప‌న్‌ప‌ల్లిలో క‌రోనా క్రిమి సంహార‌క మందును పిచికారి చేస్తున్న డీఆర్ఎఫ్ సిబ్బంది
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here