నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని అల్లూరీ సీతారామరాజు నగర్‌లో కొనసాగుతున్న భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఎస్‌రాజు నగర్ కాలనీలో ప్రాధాన్యత క్రమంలో సమస్యలన్నింటిని పరిష్కరిస్తు వస్తున్నామని అన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణల విషయంలో రాజీ పడవద్దని అధికారులకు ఆయన సూచించారు.
