శేరిలింగంప‌ల్లి ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాన్ని సంద‌ర్శించి గ‌చ్చిబౌలి కార్పొరేట‌ర్ గంగాధ‌ర్‌రెడ్డి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: క‌రోనా విజృంభన నేపథ్యంలో శేరిలింగంపల్లి ప్రభుత్వ ప్రభుత్వ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రంలో కొన‌సాగుతున్నసేవ‌ల‌ను గ‌చ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ప‌రిశీలించారు. శుక్ర‌వారం ఆరోగ్య కేంద్రాన్ని సంద‌ర్శించిన గంగాధ‌ర్‌రెడ్డి అక్క‌డ కోవిడ్ 19 టెస్టులు, వ్యాక్సినేష‌న్ తీరును సిబ్బంది, క్యూలో ఉన్న ప్ర‌జ‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు త‌లెత్త‌కుండా సేవ‌లు అందించాల‌ని, లాక్‌డౌన్ నేప‌థ్యంలో దూర ప్రాంతాల నుంచి వ‌చ్చేవారికి తీరిగి పంపించ‌కుండా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు, వ్యాక్సిన‌నేష‌న్ స‌కాంలో అందించాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో కార్పొరేట‌ర్‌తో పాటు బిజెపి రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు త‌దిత‌రులు పాల్గొన్నారు.

సిబ్బందితో మాట్లాడుతున్న కార్పొరేట‌ర్ గంగాధ‌ర్‌రెడ్డి, హ‌నుమంతు నాయ‌క్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here