నమస్తే శేరిలింగంపల్లి: రంజాన్ వేడుకలు శేరిలింగంపల్లిలో నిరాడంబరంగా ముగిశాయి. కరోనా విజృంభన, దానికి తోడు లాక్‌డౌన్ నేపథ్యంలో ఈద్గాల వద్ద సామూహిక ప్రార్ధనలకు ముస్లింలు దూరంగ ఉన్నారు. ఇండ్లలోనే ప్రత్యేక ప్రార్ధనలు జరుపుకుని ఫోన్‌లు, ఆన్‌లైన్‌లో మిత్రులు, శ్రేయోభిలాషులకు ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఓల్డ్ హఫీజ్‌పేట్‌కు చెందిన ప్రజయ్ షెల్టర్స్ ఈద్గాలో ఆనవాయితీగా రంజాన్ ప్రార్థనలు నిర్వహించారు. మౌల్వి హఫీజ్ సిరాజ్‌నేతృత్వంలో స్థానిక ముస్లింలు సయ్యద్ అహ్మద్ హుస్సేన్, ఇమ్రాన్, షోయబ్‌లు భౌతిక దూరం పాటిస్తూ రంజాన్ ప్రత్యేక నమాజు ఆచరించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలంటు వారు ఆల్లాను వేడుకున్నట్టు తెలిపారు.
ఆదిత్యనగర్‌లో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ గాంధీ…
మాదాపూర్ డివిజన్ అధిత్యనగర్‌లోని టీఆర్ఎస్ నాయకులు అబ్ధుల్ రహమాన్ నివాసంలో జరిగిన రంజాన్ వేడుకలలో ప్రభుత్వ విప్, శేరిలింంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. వారి కుటుంబ సభ్యులతో పాటు స్థానిక ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి విందు భోజనం ఆరగించారు. లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ ఇండ్లలోనే ప్రార్ధనలు జరుపుకుని ప్రభుత్వానికి సహకరించినందుకు శేరిలింగంపల్లి ముస్లింలకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నే శ్రీనివాస్ రావు, నాయకులు సాంబశివరావు, రాములు యాదవ్, ముక్తార్, అంకరావు తదితరులు పాల్గొన్నారు.