నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్‌పేట్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మంగళవారం సందర్శించారు. కరోనా టెస్టులు, కోవిడ్ వ్యాక్సినేషన్ తదితర సేవల గురించి కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వినయ్‌బాబుని అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి తీవ్ర ఒత్తిడి వస్తున్నప్పటికి ఏ ఆటంకాలు లేకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నామని, ప్రతి రోజు దాదాపు 500 మందికి వ్యాక్సిన్ ఇస్తున్నట్టు డాక్టర్ వినయ్‌బాబా తెలిపారు. అందరితో పాటు మియాపూర్ డివిజన్ నుంచి వచ్చే ప్రజలకు సహకారం అందించాలని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రకాంత్ వారిని కోరారు.






