నమస్తే శేరిలింగంపల్లి: కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి పది రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు నిత్యావసరాల కోసం సడలింపు ఇవ్వనున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ ఎట్టిపరిస్థితుల్లో పెట్టబోమని, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ప్రకటించినప్పటికీ రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజల నుండి సైతం లాక్డౌన్ పెట్టాలని ఒత్తిళ్లు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.