హైటెక్స్‌లో 200 ప‌డ‌క‌ల‌తో ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోవిడ్‌ ఐసోలేష‌న్ సెంట‌ర్‌… ప్రారంభించిన ఎమ్మెల్సీ క‌విత‌…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: మాదాపూర్ హైటెక్స్‌లోని ఎన్ఏసీ భ‌వ‌నంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆద్వ‌ర్యంలో 200 ప‌డ‌క‌ల‌తో కోవిడ్ ఐసోలేష‌న్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేశారు. ఎన్ఏసీ, ఇంట‌ర్నేష‌న‌ల్ అసోసియేష‌న్ ఫ‌ర్ హ్యూమ‌న్ వ్యాల్యూస్, ఎస్‌సీఎస్‌సీ, జీహెచ్ఎంసీల అనుసంధానంతో కొన‌సాగే ఈ సెంట‌ర్‌ను సోమ‌వారం ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, డిప్యూటీ మేయ‌ర్ శ్రీల‌త‌, సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్‌, ఎస్‌సీఎస్‌సీ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి ఏదుల‌ కృష్ణల‌తో క‌ల‌సి ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ క‌రోనా విజృంభన కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు అన్ని ర‌కాలుగా అండాగా ఉంటూ మెరుగైన సేవ‌ల కోసం ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని అన్నారు. ప్ర‌భుత్వ అందిస్తున్న సేవ‌ల‌కు స్వ‌చ్ఛంద సంస్థ‌ల తోడ్పాటు ఇవ్వ‌డం ఎంతో అభినంద‌నీయ‌మ‌ని అన్నారు.

కోవిడ్ ఐసోలేష‌న్ సెంట‌ర్‌ను ప్రారంభించి అక్క‌డి ఏర్పాట్లు ప‌రిశీలిస్తున్న ఎమ్మెల్సీ క‌విత‌, ప్ర‌భుత్వ విప్ గాంధీ, సీపీ స‌జ్జ‌నార్

రోగుల‌కు స‌క‌ల సౌక‌ర్యాలు: సైబ‌రాబాద్‌ సీపీ స‌జ్జ‌నార్‌
సైబ‌రాబాద్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్ మాట్లాడుతూ ఈ సెంట‌ర్‌లో 200 ప‌డ‌క‌ల‌తో పాటు ఆక్సిజ‌న్ కాన్స‌న్ట్రేట‌ర్‌ల‌నున అందుబాటులో ఉంచామ‌ని, జిల్లా క‌లెక్ట‌ర్ ద్వారా వైద్య సిబ్బందిని కేటాయించ‌డం జ‌రిగింద‌ని అన్నారు. రోగుల‌కు మందులు, మూడు పూట‌ల భోజ‌నంతో పాటు వాటు వారి మాన‌సిక స్వాంత‌న కోసం యోగా, ఇత‌ర ఆట‌ల‌కు అవ‌కాశం క‌ల్పించిన‌ట్టు తెలిపారు. ఈ సెంట‌ర్ కొండాపూర్ ఏరియా హాస్పిట‌ల్‌తో పాటు కోవిడ్ కంట్రోల్ రూంకు అనుసంధానంగా ప‌నిచేస్తుంద‌ని, ఇక్క‌డ వ‌స‌తి పొందేందుకు ఫోన్ 9490617440లో సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని సూచించారు.

ఐసోలేష‌న్ సెంట‌ర్‌లో రోగుల కాల‌క్షేపం కోసం ఏర్పాటు చేసిన చెస్‌, క్యారంబోడ్లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here