నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శేరిలింగంపల్లి సీనియర్ జర్నలిస్ట్, మెదక్ జిల్లా, రేగోడ్ మండలo, ప్యారారం గ్రామానికి చెందిన తెనుగు నర్సింహులు ముదిరాజ్ నియమితులయ్యారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు దారం యువరాజ్ ముదిరాజ్ ఆదివారం నియామక పత్రాన్ని నర్సింలు ముదిరాజ్‌కు అందజేశారు. ఉన్నతమైన చదువులు చదివిన వ్యక్తిగా జర్నలిస్టుగా, నికార్సైన వార్తలు రాస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ రాష్ట్రంలో ముదిరాజుల పై జరుగుతున్న అన్యాయాలు , హాస్టల్లో సీట్ల పంపకాలు, రిజర్వేషన్ల పై పోరాడే వ్యక్తి గా, జాతి సేవలో విశిష్ట సేవలు అందించగలరనే నమ్మకంతో ఈ నియామకం జరిగిందని ఆయన తెలిపారు. అన్ని వర్గాలను సమీకరిస్తూ , రాజకీయాలకు అతీతంగా నియమనిబంధనలు పాటిస్తూ, జాతి సమగ్రతకు, సర్వతోముకాభివృ ద్దికి అహర్నిశలు కృషి చేయాలని ఆయన సూచించారు. నర్సింహులు ముదిరాజ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి భాద్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు దారం యువరాజ్ ముదిరాజ్‌కు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అంకిత భావంతో పని చేస్తూ, ముదిరాజుల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.