నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట మజీద్లో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో ఆదివారం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై ముస్లింలకు ప్రభుత్వం తరపున రంజాన్ కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్టాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలకు అండగా ఉంటుందని, వారి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని అన్నారు. కరోనా విలయ తాండవం చేస్తున్నప్పటికి ముస్లింలు ప్రశాంత వాతావరణంలో ఈద్ జరుపుకోవాలనే దూర దృష్టితో ప్రభుత్వం ఆనవాయితీ వస్తున్న రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నదని అన్నారు. ఈ క్రమంలో ముస్లింలు ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉప్పాలపాటి శ్రీకాంత్, నార్నే శ్రీనివాసరావు చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథరెడ్డి, స్ధానిక నాయకులు అక్బర్ ఖాన్, మెయిజ్, యుసుప్ పాషా , దాసు, అల్తాఫ్, సయ్యద్ పాషా, ఎల్ఐసి వేంకటేష్, మెయినోద్దిన్, సయ్యద్ పాషా, మాజిద్, షౌకత్, రవిందర్ రెడ్డి, నరేందర్ బల్ల, మార్టిన్, ఉమా శేఖర్ తదితరులు పాల్గొన్నారు.