పారిశుధ్యం విష‌యంలో రాజీ ప‌డితే స‌హించేది లేదు: కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: మియాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని పలు కాలనీలలో శుక్ర‌వారం ఉదయం పారిశుధ్య కార్మికుల ప‌నితీరును స్థానిక కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్ ప‌రిశీలించారు. కోవిడ్ ఉదృతి నేప‌థ్యంలో పారిశుధ్యం విష‌యంలో రాజీ ప‌డితే స‌హించేది లేద‌ని ఆయ‌న సిబ్బందికి సూచించారు. సిబ్బంది త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ త‌మ విధులు నిర్వ‌హించాల‌ని అన్నారు. డివిజ‌న్‌లోని ప్ర‌తి కాల‌నీ, బ‌స్తీలో స‌కాలంలో చెత్త‌ను సేక‌రించాల‌ని, ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూడాల‌ని ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎస్ఆర్‌పీలు తిప్ప‌ర్తి మ‌హేష్‌, క‌న‌క‌రాజు, ఎస్ఎఫ్ఎలు నాగ‌రాజు, గురుచ‌ర‌ణ్‌, నాగ‌రాజు గౌడ్‌, విన‌య్‌, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.

మియాపూర్ చౌర‌స్తా వ‌ద్ద ఎస్ఆర్‌పీ, ఎస్ఎఫ్ఏల‌తో మాట్లాడుతున్న కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here