నమస్తే శేరిలింగంపల్లి: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి శుక్రవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. డివిజన్ 27 బిజెపి అభ్యర్థి చింతాకుల అనిల్‌తో కలసి హన్మకొండ గోవిందరాజు గుట్ట దేవాలయంలో పూజలు నిర్వహించిన గంగాధర్‌రెడ్డి స్థానిక బస్తీలు, కాలనీలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనిల్‌కుమార్‌కు మద్ధతు తెలిపి బారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌పై బిజెపి జెండా ఎగరడం ఖాయమని గంగాధర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, స్థానిక బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.