నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ బస్ స్టాండ్ వద్ద హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రంను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ప్రజలు దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. పాదచారులు, వాహనదారుల దప్పిక తీర్చేందుకు మనసున్న మహరాజులు ముందుకు వచ్చి విరివిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, టీఆర్ఎస్ చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు దాసరి గోపి కృష్ణ, జనార్దన్ రెడ్డి, సాయి, అక్బర్ ఖాన్,సైదేశ్వర్, సురేందర్, ఫౌండేషన్ ప్రతినిధులు మారం వెంకట్, రెడ్డి ప్రవీన్రెడ్డి, సందీప్, హమీద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.