కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న చందాన‌గ‌ర్ స‌ర్కిల్ ఉప‌క‌మిష‌న‌ర్ సుధాంషు నంద‌గిరి

న‌మ‌స్తే శేరిలింగంపల్లి: జీహెచ్ఎంసీ చందాన‌గ‌ర్ స‌ర్కిల్ 21 ఉప‌క‌మిష‌న‌ర్ సుధాంషు నంద‌గిరి గురువారం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. నిజాంపేట్‌లోని ఎస్ఎల్‌జీ హాస్పిట‌ల్‌లో కోవాక్జిన్ టీకా తీసుకున్న సుధాంషు మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సినేష‌న్ విష‌యంలో అపోహాలు అవ‌స‌రం లేద‌ని ప్ర‌జ‌ల‌కు ఆయ‌న సూచించారు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం అర్హులైన వారంతా విధిగా టీకా తీసుకోవాల‌ని పిలుపునిచ్చారు. కోవిడ్ సెకండ్ వేవ్ ఉదృతి కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, విధిగా మాస్కులు ధ‌రించాల‌ని, భౌతిక దూరం పాటించాల‌ని సూచించారు. ఎప్ప‌టిక‌ప్పుడు చేతుల‌ను శుభ్రంగా క‌డుక్కోవాల‌ని లేదా శానిటైజ్ చేసుకోవాల‌ని అన్నారు.

సుధాంషు నంద‌గిరికి కోవాగ్జీన్ టీకా ఇస్తున్న ఎస్ఎల్‌జీ హాస్పిట‌ల్ సిబ్బంది
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here