నమస్తే శేరిలింగంపల్లి: మంచి అలవాట్లను అలవరచుకుని తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి యువత పాటు పడాలని బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మద్దికాయల అశోక్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా బుధవారం మియాపూర్ స్టాలిన్‌నగర్‌లో ఎఐఎఫ్‌డివై ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లల కొరకు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎఐఎఫ్‌డివై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనం సుధాకర్ తో కలిసి మద్దికాయల అశోక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజం అనేక రుగ్మతలతో పాటు అనారోగ్యం తో నిండి ఉందని అందులోయువత చిన్న వయసు నుండే రోగాల బారినపడుతున్నారని అన్నారు. చిన్న పిల్లలలో సోకే తలసేమియా వ్యాధి అత్యంత బాధాకరమైనదని వారికి రక్తదానం చేయడానికి చాలామంది యువత ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. యువత మద్యపానం దుమ్మ పానం చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని వాటికి వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది తాండ్ర రమేష్, సుజీవన్ బాబు, కృష్ణ, కన్నా శ్రీనివాస్, వరుణ్, ఎఐఎప్‌డివై రాష్ట్ర కమిటీ సభ్యులు డి మధుసూదన్, నాయకులు డి శ్రీనివాసులు, బి రవి, కే.రాజు, రతన్ నాయక్, పల్లె మురళి, శరీస్, కీర్తి, లక్ష్మి, ఎం రాణి, సుజాత తదితరులు పాల్గొన్నారు.






