నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ బిజెపి సీనియర్ నాయకులు ఎం.రవికుమార్ యాదవ్ బుధవారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బాపునగర్‌లో పార్టీ నాయకులు, బస్తీ వాసులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లపై పేరుకుపోతున్న వ్యర్ధాల కారణంగా తీవ్ర అవస్థలు పడుతున్నట్లు కాలనీవాసులు వివరించారు. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని రవికుమార్‌యాదవ్ తెలిపారు. సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని రవికుమార్‌యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ కంటెస్టెడ్ అభ్యర్థి కర్చర్ల ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు.






