నమస్తే శేరిలింగంపల్లి: టిఆర్ఎస్ మైనారిటీ రాష్ట్ర నాయకుడు ఎండి అన్వర్ షరీఫ్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. మియాపూర్ లోని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ లు అన్వర్ షరీఫ్ చేత కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకల్లో డివిజన్ టిఆర్ఎస్ నాయకులు ఎం.గంగాధర్ రావు, బండారు మోహన్ ముదిరాజ్, మహేందర్ ముదిరాజ్, మాధవరం గోపాల్ రావు, శ్రీనివాస్, ఖాజా, జహంగీర్, రోషన్, రాజు, రవిలు పాల్గొని అన్వర్ షరీఫ్ కు అభినందనలు తెలియజేశారు.






