గోపిన‌గ‌ర్‌లో ఘ‌నంగా భార‌తీయ జ‌న‌త పార్టీ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: భార‌తీయ జ‌న‌త పార్టీ ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని బిజేవైఎం రాష్ట్ర నాయ‌కుడు నీర‌టి చంద్ర‌మోహ‌న్ ఆద్వ‌ర్యంలో శేరిలింగంప‌ల్లి డివిజ‌న్ గోపిన‌గ‌ర్‌లో మంగ‌ళ‌వారం పార్టీ జెండావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా ప‌రిష‌త్ మాజీ వైస్ చైర్మ‌న్ నంద‌కుమార్ యాద‌వ్‌, బిజెపి జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చింత‌కింది గోవ‌ర్థ‌న్ గౌడ్‌లు మాట్లాడుతూ రెండు సీట్ల‌తో ప్ర‌యాణాన్ని ప్రారంభించిన భార‌తీయ జ‌న‌త పార్టీ నేడు 303 సీట్ల‌తో అధికారంలో కొన‌సాగుతుంద‌ని, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎక్కువ మంది స‌భ్య‌త్వం క‌లిగిన భార‌తీయ జ‌న‌త పార్టీలో స‌భ్యుల‌యినందుకు గ‌ర్వ‌ప‌డుతున్నామ‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా అధికార ప్ర‌తినిధి మారం వెంక‌ట్‌, డివిజ‌న్ అధ్య‌క్షుడు రాజుశెట్టి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చిట్టారెడ్డి ప్రాసాద్‌, నాయ‌కులు శాంతిభూష‌న్‌రెడ్డి, మ‌హేష్ గౌడ్‌, మ‌హేష్‌, భార‌తి, అశోక్‌, ర‌వి, మ‌స్తాన్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ‌

పార్టీ జెండావిష్క‌ర‌ణ‌లో పాల్గొన్న నంద‌కుమార్ యాద‌వ్‌, చింత‌కింది గోవ‌ర్ధ‌న్ గౌడ్‌, చంద్ర‌మోహ‌న్ త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here