నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాతృ శ్రీ నగర్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ సభ్యులు సోమవారం ప్రభుత్వ విప్ ఆరెకపూడిగాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గాంధీ వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. నూతన కార్యవర్గ సభ్యులు కాలనీ వాసులందరికి ఎల్లవేళాల అందుబాటులో ఉంటూ కాలనీ సమస్యలపై స్పందిస్తూ, కాలనీ అభివృద్ధి కి పాటుపడాలని, ఒక ఆదర్శవంతమైన కాలనీగా తీర్చిదిద్దే క్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు కావూరి అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు ఎస్వీ అంజనేయరాజు, ప్రధాన కార్యదర్శి నాగరాజు, సంయుక్త కార్యదర్శి భాస్కర్ రెడ్డి, కోశాధికారి రంగరావు, కార్యవర్గ సభ్యులు రవి, విజయ్ బాబు, కిషోర్, సాయి,కృష్ణ, శ్రీనివాస్, శివారెడ్డి, అరిఫ్, సుదర్శన్, హన్మంత రావు, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.






