నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్ర సాంఘీక సంక్షేమ బోర్డు చైర్మెన్ రాగం సుజాతానాగేందర్‌యాదవ్, శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగంనాగేందర్‌యాదవ్ దంపతులు కొమురవెళ్లి మల్లన్న దేవస్థానంలో మొక్కులు సమర్పించుకున్నారు. ఆదివారం కుటుంబ సమేతంగా మల్లన్న స్వామి దర్శనం చేసుకుని బంగారు కోరమీసాలు, అమ్మవార్లకు ముక్కెరలు సమర్పించారు. ఈ సందర్భంగా దేవస్థానంలో రాగం దంపతులు ప్రత్యేక పూజలు చేయించారు.ప్రజలందరూ సుఖశాంతులతో వర్దిల్లాలని మల్లన్న స్వామిని కోరుకున్నట్లు వారు తెలిపారు.