నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రైతాంగా సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య 94 వ జయంతిని పురస్కరించుకొని పాపిరెడ్డి కాలనీ కురుమ సంఘం ఆధ్వర్యంలో శనివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం కులపెద్దలు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగా సాయుధ పోరాట యోధుడు, తొలి అమరుడు దొడ్డి కొమురయ్య త్యాగం మరువలేనిదని అన్నారు. అంతటి మహానియుడి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని అన్నారు. అదేవిధంగా జనగామ జిల్లాకు ఆయన పేరును పెట్టాలని డిమాండు చేశారు . ఈ కార్యక్రమంలో కుల పెద్ద ఈరు పోచయ్య, గుడి చైర్మన్ గుంటి కుమార్, నర్సింహులు, గుంటి గట్టయ్య, తుపత్తి బీరయ్య,ఈరు సిద్ధులు,కొల్లే కృష్ణ, శ్రీను, కనకయ్య, బాపు రాజు, రాజు శెట్టి కురుమ తదితరులు పాల్గొన్నారు.