పిల్ల‌ల‌ను గ్యాడ్జెట్స్‌కు దూరం చేసి.. శారీర‌క క్రీడ‌ల వైపు ఆక‌ర్షితుల‌ను చేసేదే సిమ్ సామ్ ప్లే టౌన్‌: సుమిత్, నేహా అహుజా‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: మియాపూర్‌లో సిమ్స్ ఆండ్ సామ్స్ పార్టీ, ప్లే టౌన్ ఏర్పాట‌య్యింది. ఈ సంద‌ర్భంగా వ్య‌వ‌స్థాప‌కులు ప్ర‌ముఖ న‌టి జెని, ప‌లువురు మాడ‌ల్స్, చిన్నారుల స‌మ‌క్షంలో శుక్ర‌వారం సిమ్ సామ్ ప్లేటౌన్ నూత‌న కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భగా వ్య‌వ‌స్థాప‌కులు సుమిత్ అహుజా, నేహా అహుజాలు మాట్లాడుతూ నేడే చిన్నారులంతా శారీర‌క క్రీడ‌ల‌ను వ‌దిలేసి ఫోన్‌, ట్యాబ్లెట్‌, ల్యాప్‌టాప్ లాంటి గ్యాడ్జెట్స్‌కు బానిస‌ల‌వుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. శారీర‌క క్రీడ‌ల‌కు దూరంగా ఉండ‌టం వ‌ల్ల ప‌సిప్రాయం నుంచి అనేక రుగ్మ‌త పాల‌వుతున్నార‌ని అన్నారు. చిన్నారుల‌ను ఆ ప‌రిస్థితుల నుంచి బ‌య‌ట వేసేందుకే త‌మ సిమ్‌, సామ్ పార్టీ, ప్లేటౌన్‌ను ప్రారంభించామ‌ని అన్నారు. న‌గ‌రంలో నాల్గ‌వ సెంట‌ర్‌ను మియాపూర్‌లో ప్రారంభించుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని, ప‌రిస‌ర ప్రాంతాల ప్ర‌జ‌లు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని పిలుపునిచ్చారు.

చిన్నారుల‌తో సంద‌డి చేస్తున్న న‌టి జెని, సిమ్ సామ్ వ్య‌వ‌స్థాప‌కులు సుమిత్ అహుజా, నేహా అహుజా త‌దిత‌రులు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here