న‌ల్ల‌గండ్ల‌లో డ్రైనేజీ స‌మ‌స్య శాశ్వ‌త ప‌రిష్కారానికి కృషి చేస్తా: ప్ర‌భుత్వ విప్ గాంధీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల లో తలెత్తిన డ్రైనేజీ ఔట్ లెట్ సమస్య శాశ్వ‌త ప‌రిష్కారానికి కృషి చేస్తాన‌ని ప్ర‌భుత్వ విప్ గాంధీ అన్నారు. మంగ‌ళ‌వారం కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు తెల్లాపూర్ కమాన్ వద్ద జోనల్ కమిషనర్ రవి కిరణ్, జిహెచ్ఎంసి అధికారులతో కలిసి డ్రైనేజీ స‌మ‌స్య‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా గాంధీ గారు మాట్లాడుతూ సరైన ఔట్ లెట్ లేక మురుగు నీరు పరిసర ప్రాంతాలలో నిల్వ ఉండి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయ‌ని, త్వరలోనే డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చేపడుతామని అన్నారు. నాణ్యత ప్రమాణాలతో డ్రైనేజి పనులు చేపట్టాలని, ప్రజలకు ఇబ్బంది కలుగ‌కుండా పనులు త్వరితగతిన పూర్తి చేసి  ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ  కార్యాక్రమంలో అధికారులు ఎస్ఈ చిన్నా రెడ్డి, ఈఈ సుదర్శన్, డీఈ శ్రీనివాస్ , ఏఈ కవిత శేరిలింగంపల్లి టౌన్ ప్లానింగ్ సీపీ శ్రీనివాస్, వర్క్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్, తెరాస నాయకులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


న‌ల్ల‌గండ్ల ప‌ర్య‌ట‌లో భాగంగా డ్రైనేజీ స‌మ‌స్యపై అధికారుల‌తో చ‌ర్చిస్తున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here