క్రీడ‌లు శారీర‌క ధృఢ‌త్వానికి, మానసికోల్లాసానికి దోహ‌దం చేస్తాయి: ప్ర‌భుత్వ విప్ గాంధీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పెరల్ విలేజ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన‌ బాస్కెట్ బాల్, బాడ్మింటన్ కోర్టులను ఆదివారం ప్ర‌భుత్వ విప్ గాంధీ స్థానిక కార్పొరేట‌ర్‌ రాగం నాగేందర్ యాదవ్, సిఐ సురేష్తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా గాంధీ మాట్లాడుతూ కాలనీ లో ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్ బాల్ కోర్ట్ లను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. క్రీడలు శారీరక శ్రమతో పాటు మానసిక ఉల్లాసాన్ని అంద‌జేస్తాయ‌న్నారు. క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంద‌ని, పట్టణాల్లో క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడా మైదానాల నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తెరాస నాయకులు ఉట్ల కృష్ణ, శ్రీను పటేల్ కాలనీ ప్రెసిడెంట్ అనిత, సత్యనారాయణ, భాస్కర్, విశాల్, శైలజ, అనురాధ తదితరులు పాల్గొన్నారు.


ఇండోర్ స్పోర్ట్స్ కోర్టుల‌ను ప్రారంభిస్తున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ, కార్పొరేట‌ర్ రాగంనాగేంద‌ర్‌యాద‌వ్

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here