నమస్తే శేరిలింగంపల్లి: రంగారెడ్డి జిల్లా(అర్బన్) బిజెపి గిరిజన మోర్చ జిల్లా అధ్యక్షుడిగా శేరిలింగంపల్లికి చెందిన ఎన్.హనుమంత్‌నాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం జిల్లా అధ్యక్షులు సామరంగారెడ్డి జిల్లా కార్యాలయంలో శేరిలింగంపల్లి బీజేపీ నాయకులు యం. రవి కుమార్ యాదవ్ గారు, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిలతో కలిసి నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా హనుమంత్‌నాయక్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న గిరిజన బిడ్డలకు అండగా ఉంటానని, గిరిజన హక్కులకై పోరాడతానని హనుమంత్ నాయక్ తెలియజేశారు. తనకు ఈ అవకాశం కల్పించిన జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డి, రవికుమార్‌యాదవ్, కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డిలతో పాటు రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నాయకులు ఎల్లేష్, రాధాకృష్ణ, శ్రీనివాస్, బాలాకుమార్, నాగరాజు పాల్గొన్నారు.