నమస్తే శేరిలింగంపల్లి: మల్టీ బ్రాండ్ మొబైల్ స్టోర్ సెల్ బే తమ ఫ్లాగ్ షిప్ స్టోర్ ను శుక్రవారం మాదాపూర్ లో ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా జియోమి ఇండియా ఆఫ్ లైన్ సేల్స్ డైరెక్టర్ సునీల్ బేబీ, సౌత్ ఇండియా మేనేజర్ మల్లికార్జున, సినీ నటి చాందిని భగవానని, ప్రాచీ ఠాకూర్ లతో పాటు సెల్ బే ఎండి సోమ నగరాజులు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమ నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా మొబైల్ రంగంలో తమ సేవలను విస్తరించేందుకు కృషి చేస్తున్నామని, ఈ ఏడాది చివరి నాటికి 100 రిటైల్ స్టోర్లలో సేవలు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సెల్ బే డైరెక్టర్ సంజన, వైస్ ప్రెసిడెంట్ కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.






