నమస్తే శేరిలింగంపల్లి: ఆయువ్ స్టూడెంట్ యూత్ ఫౌండేషన్, ఏఆర్ ఫౌండేషన్ ఆద్వర్యంలో కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో గర్భిణీ స్త్రీలకు శక్తి పానీయాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జి.రోహిత్ ముదిరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలోని నిరుపేద గర్భిణీలకు తమవంతు భాద్యతగా ఎనర్జీ డ్రింక్స్ అందజేశామని అన్నారు. భవిష్యత్తులో తమ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి సేవలను విస్తృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు రేవంత్, గోపి, అంజి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.






