లారీ డ్రైవర్ నిర్లక్షానికి కూలీ మృతి

నమస్తే శేరిలింగంపల్లి: లారీ ఢీకొని ఓ కూలీ మృతిచెందిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్ కు చెందిన కాసుల రవి(40) సిమెంట్ లారీపై కూలిగా విధులు నిర్వహిస్తూ ఉంటాడు. ఈక్రమంలోనే చందానగర్ అర్జున్ నగర్ కాలనీలో మంగళవారం టీఎస్05 యుబి 3251 లారీ నుంచి సిమెంటు బస్తాలు అన్ లోడింగ్ చేస్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యంతో లారీని వెనక్కి తీయగా భవనానికి లారీ కి మధ్య చిక్కుకొని రవి తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే అతడిని స్థానిక శ్రీకర దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ వైద్యశాలకు తరలించారు. లారీ డ్రైవర్ షేక్ సలీంను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

కాసుల రవి మృతదేహం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here